
DET:DEC 03:
ధనుష్‌కు తొలి ₹100 కోట్ల హిట్‌గా తేరే ఇష్క్ మే?
ధనుష్ బాలీవుడ్లో ఇంతకుముందు రాంఝణా,అత్రంగి రే వంటి మంచి సినిమాలు చేశారు. కానీ ₹100 కోట్ల క్లబ్లో చేరిన తొలి హిందీ సినిమాగా తేరే ఇష్క్ మే నిలబడే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹91.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇదే ఊపు కొనసాగితే, ధనుష్‌కు తొలి ₹100 కోట్ల హిందీ సినిమా త్వరలోనే దక్కడం ఖాయం.
రాంఝణా కలెక్షన్లను ఐదు రోజుల్లోనే దాటేసింది!
ధనుష్‌కు బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా రాంఝణా. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో దాదాపు ₹81 కోట్ల లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అయితే, ధనుష్ కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ కేవలం ఐదు రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐదో రోజు (మంగళవారం) ఈ చిత్రం సుమారు ₹10.25 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించగా, మొత్తం నెట్ కలెక్షన్ ₹71 కోట్లు దాటింది. దీంతో ‘రాంఝణా’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను ఐదో రోజులోనే తేరే ఇష్క్ మే అధిగమించింది.
బాలీవుడ్లో ధనుష్ కెరీర్ బెస్ట్:
తేరే ఇష్క్ మే సినిమా ధనుష్ కెరీర్లోనే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బలమైన వారాంతం తర్వాత సోమవారం కొంచెం డ్రాప్ అయినప్పటికీ, మంగళవారం రోజు మంచి పురోగతిని చూపించింది. దీనికి కారణం పాజిటివ్ టాక్, మరియు వీక్ డేస్‌లో టికెట్ ధరలపై ఇచ్చిన ఆఫర్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్, కృతి సనన్ నటన, మరియు ఆనంద్ ఎల్ రాయ్ ఎమోషనల్ కథనానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మొదటి వారంలోనే ₹100 కోట్ల వైపు…
ప్రస్తుతం ఉన్న వసూళ్ల ట్రెండ్‌ను బట్టి చూస్తే తేరే ఇష్క్ మే సినిమా మొదటి వారంలోనే ₹100 కోట్ల నెట్ క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ భారీ విజయం ధనుష్‌కి బాలీవుడ్లో తిరుగులేని స్థానాన్ని పటిష్టం చేయనుంది.
