Devara 2: Is Jr NTR and Koratala Siva’s Sequel Shelved?

D News : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాను మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ వేడుకల మధ్య ‘దేవర 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం ఎలాంటి కొత్త అప్‌డేట్ రాలేదు.

సీక్వెల్‌పై కొనసాగుతున్న మౌనం

‘దేవర 2’ విషయంలో గతంలో నిర్మాత సుధాకర్ మిక్కిలినేని సినిమా కొనసాగుతుందని స్పష్టం చేసినప్పటికీ.. ఆ తర్వాత ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూడా సీక్వెల్‌పై ప్రకటన లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు సందేహాలు పెరుగుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రంలో నటించాల్సి ఉంది. మరోవైపు కొరటాల శివ ప్రస్తుతం బాలకృష్ణతో చేయనున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ‘దేవర 2’ కంటే వీరి ఇతర ప్రాజెక్ట్‌లకే ప్రాధాన్యం పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ‘దేవర 2’ నిజంగా ఆగిపోయిందా? లేక కొంతకాలం తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్తుందా? అనే విషయంపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత లేదు. అందుకే ప్రస్తుతం సీక్వెల్ పరిస్థితిపై వస్తున్న వార్తలను అధికారిక నిర్ణయంగా భావించలేం. చిత్రబృందం నుంచి వచ్చే ప్రకటనతోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

By Avinash