D Educt: Oct 15: ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు అక్టోబర్‌ 16వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అక్టోబర్‌ 14వ తేదీ మధ్యాహ్నం నాటికి మొత్తం 6,633 దరఖాస్తులు అందినట్లు టెట్‌ కన్వీనర్‌ గాజర్ల రమేశ్‌ తెలిపారు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అక్టోబర్‌ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు.