
D Educt: Sept 9: పీజీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కృష్ణ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ 8తో ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మరో నాలుగు రోజులు గడువు పొడిగించినట్లు కన్వీనర్ వెల్లడించారు.
అభ్యర్థులకు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, రిజిస్ట్రేషన్ రెండింటినీ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
