
D Educt: Sept 30: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబరు 29న ప్రకటన విడుదల చేశారు.
ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్ లేదా డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా మ్యాథ్స్ చదివి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరిగా తెలిపారు.
అర్హత ఉన్న విద్యార్థులు పొడిగించిన గడువును వినియోగించుకుని ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.
