DET:DEC 24:
కాయదు లోహర్ రాకపై క్లారిటీ:
నాని తన 32వ సినిమాగా ది ప్యారడైజ్ ప్రకటించినప్పటి నుండి ఇందులో నటించే హీరోయిన్ ఎవరనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి.అయితే కాయదు లోహర్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్ట్‌లోకి తాను చేరినట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది.దీనితో ఆమె అభిమానులు మరియు నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

శ్రీకాంత్ ఓదెలతో రెండోసారి:

ఈ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో నాని – శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.మరోసారి అదే తరహా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వీరు ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో కాయదు లోహర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సమాచారం.

హైదరాబాద్ నేపథ్యంలో కథ:
ది ప్యారడైజ్ సినిమా కథా నేపథ్యం హైదరాబాద్ అని తెలుస్తోంది.ముఖ్యంగా పాతబస్తీ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నట్లు టాక్.ఈ సినిమాలో నాని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని గన్ పట్టుకుని ఆయన కనిపించే తీరు కొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చింది.

షూటింగ్ అప్‌డేట్స్:
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాయదు లోహర్ ఎంట్రీతో ఈ సినిమాకు మరింత ఫ్రెష్‌నెస్ రానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana