
DSports 02Feb 2026: ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై-ప్రోఫైల్ మ్యాచ్ను పాకిస్థాన్ ఆడబోదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అఫ్రిది స్పందిస్తూ అటు విచారాన్ని, ఇటు తన ప్రభుత్వ నిర్ణయానికి మద్దతును వ్యక్తం చేశారు.
- “నేను ఎప్పుడూ ఒకే మాట నమ్ముతాను.. రాజకీయాలు మూసివేసిన తలుపులను క్రికెట్ ఒక్కటే తెరవగలదు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ భారత్తో ఆడకపోవడం నిజంగా విచారకరం (Regrettable)” అని అఫ్రిది పేర్కొన్నారు.
- వ్యక్తిగతంగా బాధగా ఉన్నప్పటికీ, తన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, దానికి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు.
- “ఐసీసీ తన నిష్పక్షపాతాన్ని కేవలం ప్రకటనల ద్వారా కాకుండా, కచ్చితమైన నిర్ణయాల ద్వారా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ప్రతి సభ్య దేశాన్ని న్యాయంగా, సమానంగా చూడాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
