
DET:DEC 22:
వివాదానికి గల నేపథ్యం:
కార్తీక్ ఆర్యన్,అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.అయితే ఈ సినిమా టీజర్ మరియు పాటల్లో 1992 నాటి విశ్వాత్మ సినిమాలోని ప్రసిద్ధ సాత్ సముందర్ పార్ పాటలోని సిగ్నేచర్ ట్యూన్ మరియు హుక్ లైన్స్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.దీనిపై అసలు హక్కులు కలిగిన త్రిమూర్తి ఫిల్మ్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కోర్టును ఆశ్రయించిన త్రిమూర్తి ఫిల్మ్స్:
ఈ పాట విషయంలో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వలేదని త్రిమూర్తి ఫిల్మ్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ధర్మ ప్రొడక్షన్స్,సరిగమ మ్యూజిక్ మరియు రాపర్ బాద్షాపై ఈ కేసు నమోదైంది.ఈ పాటను వాడటం వల్ల తమ మేధో సంపత్తి హక్కులకు భంగం కలిగిందని వారు వాదిస్తున్నారు.
రూ.10 కోట్ల భారీ నష్టపరిహారం:
తమ అనుమతి లేకుండా ఐకానిక్ సాంగ్‌ను రీమిక్స్ చేసినందుకు గానూ,త్రిమూర్తి ఫిల్మ్స్ దాదాపు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది.అలాగే ఈ వివాదం తేలే వరకు సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని లేదా ఆ పాటను సినిమా నుండి తొలగించాలని కోర్టును కోరారు.
సరిగమ సంస్థ వాదన:
మరోవైపు ఈ పాట పంపిణీ హక్కులు తమ వద్ద ఉన్నాయని అందుకే ఈ రీమేక్‌కు లైసెన్స్ ఇచ్చామని సరిగమ సంస్థ పేర్కొంది.అయితే పాత ఒప్పందాల ప్రకారం సరిగమకు కేవలం ఆడియో పంపిణీ హక్కులే ఉన్నాయని కొత్త సినిమాల్లో వాడేందుకు అనుమతి ఇచ్చే అధికారం లేదని త్రిమూర్తి ఫిల్మ్స్ వాదిస్తోంది.ఈ కేసుపై బాంబే హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది.సినిమా విడుదల కావడానికి కేవలం మూడు రోజుల ముందు ఈ విచారణ ఉండటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది.కోర్టు తీర్పును బట్టి ఈ పాట సినిమాలో ఉంటుందా లేదా అనేది తేలనుంది.
