
DSports 14Feb 2026:కొలంబో: పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ, హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొలంబోలోని టీమ్ హోటల్ లాబీలో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి నడుస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. అయితే, ఇందులో హార్దిక్ బాత్‌రోబ్ (Bathrobe) ధరించి కనిపించడం మరియు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.
- సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హార్దిక్ పాండ్యా తన భాగస్వామి మహికా శర్మ చేతిని పట్టుకుని హోటల్ లోపలికి వెళ్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా మహికాకు శుభాకాంక్షలు చెబుతూ, తన మెడ వెనుక భాగంలో ఆమె పేరులోని మొదటి అక్షరం ‘M’ మరియు రెండు చిరుతల ఆకృతులతో కూడిన కొత్త టాటూను కూడా హార్దిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
- కుటుంబ సభ్యులకు అనుమతి లేదా? తాజా సమాచారం ప్రకారం, టీ20 వరల్డ్ కప్ వంటి చిన్న టోర్నీల సమయంలో ఆటగాళ్లు తమ భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను టీమ్ హోటల్‌లో ఉంచుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు.ప్రత్యేక ఏర్పాట్లు ఒకవేళ కుటుంబ సభ్యులు రావాలనుకుంటే, వారు సొంత ఖర్చులతో వేరే హోటల్‌లో ఉండాలని, టీమ్ బస్సులో లేదాrestricted ఏరియాలోకి వారికి అనుమతి ఉండదని నిబంధనలు చెబుతున్నాయి.ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్ హార్దిక్ ఏకంగా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హోటల్ లాబీలో కనిపించడంపై “నిబంధనలు అందరికీ ఒకేలా ఉండవా?” అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
