DNews: Dec 09: జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, గత పంచాయతీ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి 100 శాతం పోలింగ్ సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పంచాయతీల తొలి దశ పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఆ సమయానికి ముందు వచ్చినవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. విజేతలను ప్రకటించి, ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఉండేందుకు 31 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను లేదా అభ్యంతరాలను 08462 223545 నంబరుకు తెలియజేయవచ్చు. బలవంతపు ఏకగ్రీవ నిర్ణయాలు చెల్లవు. మండల స్థాయి అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించిన పంచాయతీలను పరిశీలిస్తారు. బలవంతం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు తేలితేనే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. బలవంతం ఉన్నట్లు తేలితే అది చెల్లదు. తొలి దశలో 184 సర్పంచ్, 1,642 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1,741 ప్రెసైడింగ్ అధికారులు, 2,350 ఓపీఓలు విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ సామగ్రిని 10వ తేదీన పంపిణీ చేసి కేంద్రాలకు తరలిస్తారు. పోలింగ్ శాతం పెంచేందుకు 2.21 లక్షల మంది ఓటర్లకు చీట్లు పంపిణీ చేశారు. సహాయ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. చీటుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంటాయి. సహాయకులను నియమిస్తారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని 31 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వెబ్‌కాస్టింగ్ నిఘా కొనసాగుతుంది. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బంది, ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను పర్యవేక్షిస్తారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana