
DNews : Dec 01: ఆదిలాబాద్‌లో క్రీడా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక ఇంద్రప్రియదర్శిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. సభా వేదిక ఏర్పాట్లు మరియు ఇతర సన్నాహక పనులపై సంబంధిత అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి నరేంద్ర రాథోడ్, రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
