D NEWS: హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల సైబర్ భద్రత అత్యంత కీలకమని పేర్కొంటూ, తెలంగాణలో సమగ్ర ‘చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ అక్కడ పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించేంత అవగాహన వారికి ఉండకపోవచ్చని సీఎం అన్నారు. డిజిటల్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మహిళలు, పిల్లల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

బాధితులకు ఒకే చోట అవసరమైన సేవలు అందించేలా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు, CybHER యాప్ ద్వారా విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

TGS-LSA ద్వారా ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. పిల్లలతో ప్రతిరోజూ స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ సరైన మార్గదర్శకత్వం, ప్రేమ అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. సైబర్ నేరాల బాధితుల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని కోరారు.

గాంధీజీ న్యాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా పేదలు, బలహీనుల కోసం ఒక ఆయుధంగా ఉపయోగించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు, TGS-LSA భాగస్వామ్యంతో చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు గ్రామ స్థాయి వరకు న్యాయ సేవలను విస్తరిస్తామని తెలిపారు. న్యాయం అంటే నేరస్థులకు శిక్ష పడటమే కాకుండా బాధితుడి గౌరవాన్ని, చిన్నారి కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇవ్వడమని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana