
DSports 2 Dec:న్యూఢిల్లీ: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అస్సలు బాలేదనే వార్తలు క్రికెట్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, విభేదాలు తలెత్తాయని పలు జాతీయ మీడియా నివేదికలు, సీనియర్ క్రీడా జర్నలిస్టులు పేర్కొంటున్నారు.
టెస్టు రిటైర్మెంట్ నుంచే విభేదాలు? గతంలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత నుంచే కోచ్ గంభీర్‌తో వారి సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా వీరి టెస్టు రిటైర్మెంట్ వెనుక గంభీర్ ఒత్తిడి ఉందంటూ విమర్శలు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మారిపోయిందని సమాచారం.
