D Educt: Nov 11: TG TET 2026: రెండో టెట్ పరీక్ష తేదీలో మార్పు?.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

రాష్ట్రంలోని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం రెండో టెట్ (TG TET) పరీక్షను నవంబర్ 19న నిర్వహించాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. అయితే అదే రోజున టీజీపీఎస్సీ (TGPSC) ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు కూడా జరగనున్న నేపథ్యంలో టెట్ పరీక్ష తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు రెండు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండటంతో టెట్ తేదీని మార్చాలని విద్యాశాఖకు విజ్ఞప్తులు అందాయి.

ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష నిర్వహణ తేదీ మార్పుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల తేదీలను సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పరీక్ష తేదీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రెండో టెట్‌కు 10,586 మంది దరఖాస్తు

రెండో టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,586 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్-1కు 2,591 మంది, పేపర్-2కు 7,995 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నవంబర్ 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్

రెండో టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 12వ తేదీ నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష తేదీ మార్పుపై వచ్చే అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *