
D Educt: Oct 21: ICAI సీఏ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?
సీఏ విద్యార్థులకు కీలక అప్డేట్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సెప్టెంబర్ 2026 సీఏ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ సాయంతో అధికారిక వెబ్సైట్ icai.orgలో ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.
టాపర్ల జాబితా కూడా విడుదల
ఫలితాలతో పాటు గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం, టాపర్ల జాబితాను కూడా ICAI విడుదల చేయనుంది. సెప్టెంబర్లో నిర్వహించిన సీఏ ఫౌండేషన్ పరీక్షల ఫలితాల తేదీని మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు.
సెప్టెంబర్లో పరీక్షలు
సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు, సీఏ ఫౌండేషన్ పరీక్షలు సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ సహా నిర్దేశిత ప్రక్రియలను పూర్తి చేసి ముందుకు సాగవచ్చు.
