బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాన మీడియా సంస్థల ప్రతినిధులు రాజకీయ విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర పాలన, శాసనసభ వ్యవహారాల తీరు రైతు రుణమాఫీ.

ప్రజా సంక్షేమ పథకాల అమలుపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన కేటీఆర్ శాసనసభలో ఇటీవల అధికార పక్షం చేసిన ఆరోపణలకు గణాంకాలు వాస్తవాలతో సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వ పాలనలో నెలకొన్న వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో బీఆర్‌ఎస్‌ బాధ్యతాయుతమైన అప్రమత్తమైన ప్రతిపక్షంగా నిరంతరం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై బీఆర్‌ఎస్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు.

By Rajini