D News: Aug 11: భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బోధనా శివానందన్, 17 ఏళ్ల శ్రేయస్ రాయల్ 2026 బ్రిటీష్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి చరిత్ర సృష్టించారు. కోవెంట్రీలో ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బోధనా మహిళల విభాగంలో బ్రిటన్‌లోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా చెస్ ఛాంపియన్‌గా రికార్డు నెలకొల్పింది. ఉత్కంఠభరితంగా సాగిన ర్యాపిడ్ చెస్ ప్లేఆఫ్‌లో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల క్రీడాకారిణి త్రిషా కన్యమరాలను ఓడించి బోధనా ఈ చారిత్రక టైటిల్‌ను సొంతం చేసుకుంది.

బోధనా ప్రదర్శనపై ఇంగ్లీష్ చెస్ ఫెడరేషన్ వ్యాఖ్యాత, గ్రాండ్‌మాస్టర్ డానీ గోర్మల్లీ ప్రశంసలు కురిపించారు. ఇది నమ్మశక్యం కాని విజయం అని పేర్కొంటూ, బోధనా అసాధారణ ప్రతిభ కలిగిన క్రీడాకారిణి అని, ఇలాంటి గొప్ప ప్రతిభ తరచుగా కనిపించదని కొనియాడారు.

వాయువ్య లండన్‌కు చెందిన బోధనా శివానందన్‌ చెస్ ప్రయాణం కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రారంభమైంది. ఆమె తండ్రి స్నేహితుడు వదిలి వెళ్లిన చెస్ బోర్డుతో సరదాగా ఆట ప్రారంభించిన బోధనకు చెస్ పావులు ఆసక్తికరంగా అనిపించడంతో ఆటపై మక్కువ పెరిగింది. ఆ ఆసక్తి క్రమంగా ఆమెను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది.

ఇప్పటికే బోధనా యూకే ఓపెన్ మహిళల బ్లిట్జ్ ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం సంయుక్త బ్రిటిష్ మహిళల ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది. తాజాగా క్లాసికల్ ఫార్మాట్‌లో బ్రిటీష్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో ఆమె అద్భుతమైన హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఈ టోర్నీలో బోధనకు ఎదురైన ఏకైక ఓటమి ఆరో రౌండ్‌లో శ్రేయస్ రాయల్ చేతిలోనే కావడం విశేషం.

మరోవైపు ఆగ్నేయ లండన్‌కు చెందిన 17 ఏళ్ల శ్రేయస్ రాయల్ పురుషుల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొమ్మిది రౌండ్ల పాటు సాగిన పోటీలో అగ్రస్థానంలో నిలిచి తన తొలి బ్రిటీష్ చెస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అనుభవజ్ఞులైన ఇంగ్లాండ్ గ్రాండ్‌మాస్టర్లను అర పాయింట్ తేడాతో అధిగమించి, మొత్తం పాయింట్ల ఆధారంగా విజేతగా నిలిచాడు.

ఇంగ్లాండ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన శ్రేయస్ రాయల్.. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని పేర్కొన్నాడు. బ్రిటీష్ చెస్ ఛాంపియన్‌షిప్ 122 ఏళ్ల చరిత్రలో 2026 ఎడిషన్ అతిపెద్ద ఈవెంట్‌గా నిలిచింది. ఈ పోటీల్లో 1,750 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొనగా, ఓపెన్ ఛాంపియన్‌షిప్ విజేత కోసం రికార్డు స్థాయిలో 34,000 యూరోల ప్రైజ్ మనీని కేటాయించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana