DET:NOV 18:
విడాకులను ప్రకటించిన మీరా వాసుదేవన్:
నటి మీరా వాసుదేవన్ తన విడాకుల విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకమ్‌తో ఆమె వివాహ బంధం ముగిసిందని స్పష్టం చేశారు.నేను నటి మీరా వాసుదేవన్, అధికారికంగా ఆగస్ట్ 2025 నుండి సింగిల్‌గా ఉన్నానని ప్రకటిస్తున్నాను.నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన మరియు ప్రశాంతమైన దశలో ఉన్నాను అని ఆమె రాశారు.ఈ ప్రకటనతో పాటు,ఆమె తన కొత్త ప్రయాణాన్ని సూచిస్తూ ఒక చిరునవ్వుతో ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేశారు.

ఒక సంవత్సరం బంధం ముగిసింది:

మీరా వాసుదేవన్,విపిన్ పుతియంకం గత సంవత్సరం మే 2024లో కోయంబత్తూర్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.వీరు కుటుంబవిళక్కు అనే టెలివిజన్ సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు.వీరి వృత్తిపరమైన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.అయితే,ఈ బంధం సుమారు ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది.విడాకుల ప్రకటన తర్వాత,మీరా తన సోషల్ మీడియా ఖాతాల నుండి విపిన్‌తో ఉన్న అన్ని ఫోటోలను,వీడియోలను,ముఖ్యంగా వారి పెళ్లి ఫోటోలను తొలగించారు.

నా జీవితంలో ప్రశాంతమైన దశ: మీరా
నటి మీరా వాసుదేవన్ తన ప్రకటనలో తాను ఇప్పుడు చాలా సంతోషంగా,ప్రశాంతంగా ఉన్నానని చెప్పడం విశేషం.ఈ విభేదాలు కొన్ని నెలల క్రితమే మొదలైనా,ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం ద్వారా ఈ అధ్యాయానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది.వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల మధ్య కూడా,ఆమె ఇటీవల నటిగా సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమైన ఘట్టాన్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.

గత వైవాహిక జీవితాలు:
ఇది మీరా వాసుదేవన్‌కు మూడో విడాకులు.అంతకుముందు,ఆమె 2005లో సినిమాటోగ్రాఫర్ విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు,కానీ 2010లో వారు విడిపోయారు.ఆ తర్వాత,2012లో మలయాళ నటుడు జాన్ కోక్కెన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరిహ అనే కుమారుడు ఉన్నాడు.2016లో వీరు కూడా విడిపోయారు.ఎన్ని వ్యక్తిగత సవాళ్లు ఎదురైనా,మీరా తన వృత్తిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.