D Spiritual: Feb 18: తెలంగాణలోని ప్రసిద్ధ దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత, దర్శనాల సక్రమ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.

విశేషోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ఎదుర్కోలు, 25న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధానాలయ ముఖ మండపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలో స్వాగత తోరణాలు, ఆర్చిల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana