
DNews: Dec 06: బాన్స్వాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు మరియు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను నేటి తరానికి ఆదర్శప్రాయుడిగా అభివర్ణించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కసుల బాలరాజు కూడా పాల్గొని అంబేడ్కర్‌కు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు అని పేర్కొన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణ రెడ్డి, నాయకులు పిట్ల శ్రీధర్, ఈజాజ్, హకీమ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.
