Bigg Boss Telugu 10: Mithilesh Takes Rs 15 Lakh and Exits the House

D News : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. కొద్దిసేపటికే తన ప్రయాణాన్ని ముగించుకున్నారు. హోస్ట్ నాగార్జున ఇచ్చిన ప్రత్యేక ఆఫర్‌ను అంగీకరించి రూ.15 లక్షలు తీసుకుని షో నుంచి బయటకు వచ్చారు.

రూ.15 లక్షల ఆఫర్

కొత్తగా హౌస్‌లోకి వచ్చిన ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. రూ.15 లక్షలు తీసుకుని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లవచ్చని ప్రకటించారు.

మిగిలిన కంటెస్టెంట్లు ఈ ఆఫర్‌ను తిరస్కరించి గేమ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కానీ మిథిలేష్ మాత్రం రూ.15 లక్షలను తీసుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన బిగ్ బాస్ జర్నీ అనూహ్యంగా ముగిసింది.

మిథిలేష్ నిర్ణయం హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య చర్చకు దారితీసింది. ఇంత త్వరగా గేమ్ నుంచి తప్పుకోవడం, అందుకు బదులుగా నగదు తీసుకోవడంపై ప్రేక్షకుల్లోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా?

మిథిలేష్ ఇప్పటికే షో నుంచి బయటకు వెళ్లడంతో.. ఈ వారం సాధారణ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందా లేదా అనే ఆసక్తి మొదలైంది. ఒక కంటెస్టెంట్ స్వచ్ఛందంగా డబ్బులు తీసుకుని బయటకు వెళ్లిన నేపథ్యంలో ఈ వారానికి రెగ్యులర్ ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే బిగ్ బాస్‌లో చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్ అయినా చోటుచేసుకోవచ్చు. మిథిలేష్ ఎగ్జిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఎలిమినేషన్ లేకుండా చేస్తారా? లేక మరో కంటెస్టెంట్‌ను కూడా బయటకు పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

By Avinash