
DET:OCT 27:
రమ్య మోక్ష ప్రయాణం ముగిసింది:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టిన రమ్య మోక్ష,కేవలం రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యారు.ఏడో వారం నామినేషన్లలో అత్యంత తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లక తప్పలేదు.సాధారణంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌పై భారీ అంచనాలు ఉంటాయి,కానీ రమ్య తన ప్రవర్తనతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.
ఎలిమినేషన్‌కు కారణాలు:
రమ్య మోక్ష ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్నారు.హౌస్మేట్స్ మధ్య ఉన్న బాండింగ్స్ గురించి పదేపదే మాట్లాడటం,ముఖ్యంగా తనుజతో వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆమెకు బాగా మైనస్ అయింది.ఫిజికల్ టాస్కుల్లో బాగా ఆడినప్పటికీ,నోటి దూల వల్లనే ఆమెకు నెగిటివిటీ పెరిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో,అత్యల్ప ఓట్లతో ఆమె ప్రయాణం ముగిసింది.
రెండు వారాల జీతం ఎంత?
బిగ్ బాస్ హౌస్‌లో రెండు వారాలు ఉన్న రమ్య మోక్ష రెమ్యూనరేషన్ గురించి కూడా చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,ఆమెకు వారానికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది.ఈ లెక్కన ఆమె రెండు వారాలకు కలిపి సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం.అయితే,ఇది కేవలం అనధికారిక సమాచారం మాత్రమే.వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పటికీ సెలబ్రిటీ కోటాలో ఆమెకు మంచి పారితోషికమే లభించింది.
ప్రేక్షకుల అభిప్రాయం:
రమ్య మోక్ష ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.కొంతమంది ఆమెకు నెగిటివిటీ ఎక్కువ కావడంతో ఈ ఎలిమినేషన్ సరైనదే అని భావిస్తుంటే,మరికొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపించారని చర్చించుకుంటున్నారు.ఏదేమైనా,రమ్య మోక్ష రెండు వారాల బిగ్ బాస్ ప్రయాణం మాత్రం ప్రేక్షకులకు ఒక షాకింగ్ ట్విస్ట్‌గా మిగిలింది.
