
బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి నామినేషన్ల రచ్చ
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌లో పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి నామినేషన్ల కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెడుతుండటంతో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇప్పటికే షాలినీ, మిథిలేష్ వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ కొంతమంది కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. తాజాగా అపూర్వ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి వర్షిణిని టార్గెట్ చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వర్షిణి పర్సనాలిటీపై అపూర్వ ఘాటు వ్యాఖ్యలు
పదకొండో వారం ‘డిక్టేటర్స్’ థీమ్‌లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన అపూర్వ.. వర్షిణిని నామినేట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. పది వారాలుగా హౌస్‌లో ఉన్నప్పటికీ వర్షిణి పెద్దగా ఏమీ చేయలేదని ఆరోపించింది. తన అందం, పర్సనాలిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని విమర్శించింది.
వర్షిణి గతంలో ఉపయోగించిన కొన్ని పదాలను ప్రస్తావిస్తూ.. ఇతరులను ఎంతగా కించపరిచినా తాను మాత్రం అలాంటి భాషను ఉపయోగించనని అపూర్వ చెప్పింది. ఒక రాడ్డుకు నూనె రాసి కొడితే చర్మం ఊడిపోవాలనే అర్థం వచ్చేలా వర్షిణి మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసింది. ఆ సమయంలో ఆమె నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు తనకు వేరే అర్థాన్ని ఇచ్చాయని అపూర్వ పేర్కొంది.
మబ్బేష్ వల్లే వర్షిణి కనిపిస్తోందంటూ కౌంటర్
వర్షిణి ఆటతీరుపై విమర్శలు చేస్తూనే ముకేష్‌తో ఆమెకున్న సాన్నిహిత్యాన్ని కూడా అపూర్వ ప్రస్తావించింది. వర్షిణి హౌస్‌లో కనిపించడానికి ముకేష్ కారణమని వ్యాఖ్యానించింది.
‘మబ్బు లేనిదే వర్షం రాదు.. ఈ మబ్బేష్ లేనిదే వర్షిణి లేదు’ అంటూ వర్షిణి చేసిన డైలాగ్‌ను గుర్తుచేసింది. దీనికి త్రిగుణ్ చప్పట్లు కొడుతూ స్పందించగా, ముకేష్ కూడా థండర్స్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. వెంటనే అపూర్వ స్పందిస్తూ.. ఆ థండర్స్ మీ కిందకే వెళ్లాయని సెటైర్ వేసింది. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.
త్రిగుణ్ విషయంలోనూ జెలసీ అంటూ ఆరోపణ
గతంలో త్రిగుణ్‌ను అతడి కుటుంబ సభ్యులు ప్రశంసించినప్పుడు వర్షిణి తట్టుకోలేకపోయిందని అపూర్వ ఆరోపించింది. ఆ సమయంలో ఆమె ప్రవర్తనలో అసూయ కనిపించిందని, తనకు ఆ అసూయ అక్కడి వరకు తగిలిందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అంతేకాకుండా వర్షిణి ఇతరుల గురించి మాట్లాడే విధానాన్ని తప్పుబడుతూ.. ఆమె వ్యక్తిత్వంపైనే విమర్శలు చేసింది. ‘నేను డిజాస్ట్రస్ కెప్టెన్ అయి ఉండొచ్చు.. కానీ నువ్వు మాత్రం డిజాస్ట్రస్ పర్సన్ డార్లింగ్’ అంటూ అపూర్వ చేసిన కామెంట్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
అపూర్వ వ్యాఖ్యలకు వర్షిణి కౌంటర్
అపూర్వ చేసిన విమర్శలకు వర్షిణి కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ప్రేక్షకులు తనను ఇష్టపడకపోతే ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారని చెప్పింది. అయితే తాను రెండు మూడు వారాలకే హౌస్ నుంచి వెళ్లిపోలేదని, పదివారాలుగా ప్రేక్షకుల మద్దతుతో కొనసాగుతున్నానని పేర్కొంది.
ఈ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అపూర్వ విమర్శలు, మరోవైపు వర్షిణి కౌంటర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
For more ubdates visit:https://dtvtelangana.com/
యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో బిగ్ బాస్ ప్రోమో
Bigg Boss 10 Telugu Day 71 Promo 2 ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అపూర్వ వర్షిణిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, ముకేష్‌తో ఆమెకున్న అనుబంధంపై వేసిన సెటైర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నామినేషన్ల ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి గొడవలు చోటుచేసుకుంటాయో, వర్షిణి తన ఆటతో ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.
