
D Entr: Aug 8: సుజీత్‌తో నాని నెక్స్ట్ మూవీ.. ‘బ్లడీ రోమియో’పై భారీ అంచనాలు
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని తన తదుపరి ప్రాజెక్ట్‌ను దర్శకుడు సుజీత్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటంతో ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్టోబర్ నుంచి ‘బ్లడీ రోమియో’ షూటింగ్?
నాని–సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నానిని సుజీత్ సరికొత్త లుక్, పాత్రలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. టైటిల్, కాంబినేషన్‌తోనే ఆసక్తిని పెంచుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే?
ఈ సినిమాలో నానికి జోడీగా ఎవరు నటించనున్నారనే అంశంపై గత కొంతకాలంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దర్శక నిర్మాతలు భాగ్యశ్రీతో సంప్రదింపులు జరిపినట్లు, కథతో పాటు ఆమె పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
