D News : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.351 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

భక్తులు మెచ్చేలా ఆలయ అభివృద్ధి

భద్రాచలం ఆలయాన్ని భక్తులు మెచ్చేలా విశాలంగా, అత్యంత సుందరంగా పునర్నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధి

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను పుష్కరాల నాటికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

భద్రాచలానికి కొత్త రూపు

రాములోరి ఆలయంతో పాటు భద్రాచలం పట్టణాన్ని కూడా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.