
D Educt: Oct 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీఈడీ కన్వీనర్ కోటా ఫీజులను సవరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సవరించిన ఫీజుల ప్రకారం సాధారణ బీఈడీ కోర్సుకు రూ.10,500గా ఫీజును ఖరారు చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్సుకు రూ.17,625గా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త ఫీజులను అమలు చేయనుంది.
గతేడాదితో పోలిస్తే ఈసారి బీఈడీ ఫీజులు సుమారు 17.5 శాతం పెరిగాయి. ఫీజుల పెంపుతో విద్యార్థులపై కొంత అదనపు ఆర్థిక భారం పడనుంది. కొత్త ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదలై, అనంతరం అమల్లోకి రానున్నాయి.
