
D Spiritual: Oct 19: ట్యాంక్ బండ్ బతుకమ్మ సంబరాల్లో విజయ్ దేవరకొండ సందడి
హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యక్షమై సందడి చేశారు. ఆయన ఈ వేడుకల్లో పాల్గొనడం అక్కడికి వచ్చిన ప్రజలకు పెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. అందరితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్న విజయ్ దేవరకొండకు సంబంధించిన అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు
నెక్లెస్ రోడ్లోని కర్బలా మైదానంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాల్గొని పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖుల రాకతో ఉత్సవాల సందడి మరింత పెరిగింది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
