DET:NOV 04:
OTT విడుదల తేదీ మరియు ప్లాట్‌ఫారమ్:
అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రం ఓటీటీలో నవంబర్ 4,2025 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ దక్కించుకుంది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడవచ్చు.

భాషలు మరియు కథాంశం:
ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.తమిళం,తెలుగు,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
బ్యాడ్ గర్ల్ సినిమా కథ రమ్య అంజలి శివరామన్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది.పాఠశాల వయస్సు నుండి 30 ఏళ్ల వరకు ఆమె జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు.స్వాతంత్ర్యం,ప్రేమ,సమాజంలోని కట్టుబాట్లకు వ్యతిరేకంగా తన సొంత గుర్తింపు కోసం రమ్య చేసే పోరాటమే ఈ సినిమా.సమాజం ఒక అమ్మాయి ఎలా ఉండాలో నిర్దేశించే సమయంలో,తన ఇష్టానుసారం జీవించడానికి ప్రయత్నించే రమ్యను ‘బ్యాడ్ గర్ల్’గా ఎలా ముద్ర వేస్తారు అనేదే ముఖ్య కథాంశం.

సినిమా గురించి మరిన్ని వివరాలు:
ఈ చిత్రానికి వర్ష భరత్ దర్శకత్వం వహించారు.ఆమెకు ఇది తొలి సినిమా.
ప్రముఖ దర్శకులు వెట్రిమారన్ మరియు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను నిర్మించారు మర్పించారు.
ఇది అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంది.రొట్టర్‌డ్యామ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నెట్‌పాక్ అవార్డు గెలుచుకుంది.
థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ బోల్డ్ అండ్ క్యారెక్టర్-డ్రైవెన్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ద్వారా విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana