
DNews: Feb24: కూటమి ప్రభుత్వం కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చింది. ఈ కల్తీ పాల సంఘటన వాళ్ళ 19 మంది బాధితులు అయ్యారు . ఐదుగురు మరణించారు. YSRCP ఈ విషయాన్ని చేపడితే, ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వానికి ఏదైనా బాధ్యత ఉంటే, ముందుగా ఎందుకు స్పందించలేదు? రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ నిద్రపోతోంది. రాష్ట్రంలో ఆహార భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా 900 మంది విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. చాలా మంది మరణించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాల వల్ల అనారోగ్యంతో రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే చికిత్స లభించట్లేదు .
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 వైద్య కళాశాలలను ప్రారంభించి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబు తన వ్యాపార మోసాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.. ప్రజారోగ్యం గురించి ఆయన పట్టించుకోవడం లేదు. ఏదో తప్పు జరిగిందనే విషయం ఆయన మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలోని అనేక హాస్టళ్లలో విద్యార్థులు కూడా బాధితులుగా మారుతున్నారు. వారసత్వ సమస్యను కూడా మేము ప్రజల దృష్టికి తీసుకువచ్చాము.
