DET:DEC 24:
అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ విడుదల:
మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్ డూమ్స్‌డే చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ వచ్చేసింది.ఈ టీజర్ చూస్తుంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్ళీ పాత వైభవాన్ని సంతరించుకోబోతున్నట్లు కనిపిస్తోంది.భారీ విజువల్స్ మరియు ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త విలన్ల రాకతో అవెంజర్స్ టీమ్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతుందో ఇందులో క్లుప్తంగా చూపించారు.

మళ్ళీ కెప్టెన్ అమెరికాగా క్రిస్ ఎవాన్స్:

ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే క్రిస్ ఎవాన్స్ మళ్ళీ కెప్టెన్ అమెరికాగా వెండితెరపై కనిపించబోతున్నారు.అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత ఆయన పాత్ర ముగిసిందని భావించిన అభిమానులకు ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్.అయితే ఆయన పాత స్టీవ్ రోజర్స్ పాత్రలోనే వస్తారా లేదా మల్టీవర్స్ కారణంగా వేరే రూపంలో కనిపిస్తారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.క్రిస్ ఎవాన్స్ రాకతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కొత్త విలన్ మరియు కథా నేపథ్యం:
ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ డాక్టర్ డూమ్ పాత్ర రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం.ఐరన్ మ్యాన్‌గా మనల్ని అలరించిన ఆయన ఇప్పుడు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఎలా మెప్పిస్తారో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.లోకాలను రక్షించే క్రమంలో అవెంజర్స్ అందరూ కలిసి ఈ కొత్త శత్రువును ఎలా ఎదుర్కొంటారనేదే ఈ డూమ్స్‌డే కథాంశం.

దర్శకత్వం మరియు విడుదల వివరాలు:

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరు అందించిన ఇన్ఫినిటీ వార్,ఎండ్‌గేమ్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి.మళ్ళీ వీరిద్దరూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయని తెలుస్తోంది.ఈ సినిమా వచ్చే ఏడాది భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana