DET:DEC 17:
రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్‌గా కొత్త రూపం:
ఈ లీక్ అయిన క్లిప్‌లలో అందరి దృష్టిని ఆకర్షించింది రాబర్ట్ డౌనీ జూనియర్.ఐరన్ మ్యాన్‌గా ప్రపంచాన్ని రక్షించిన ఆయన, ఇప్పుడు డాక్టర్ డూమ్ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.టీజర్‌లోని ఒక భాగంలో ఆయన మాస్క్ ధరించి అత్యంత శక్తివంతంగా కనిపిస్తుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.గతంలో హీరోగా మెప్పించిన ఆయన,ఇప్పుడు విలన్‌గా ఎలా అలరిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

క్రిస్ ఎవాన్స్ రీ-ఎంట్రీ కెప్టెన్ అమెరికా మళ్ళీ వస్తున్నారా?
చాలా కాలంగా క్రిస్ ఎవాన్స్ మళ్ళీ మార్వెల్ సినిమాల్లోకి వస్తారా లేదా అన్న సందేహం ఉండేది.అయితే ఈ లీక్ అయిన వీడియోలలో క్రిస్ ఎవాన్స్ స్టీవ్ రోజర్స్ కెప్టెన్ అమెరికాగా కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒక టీజర్‌లో ఆయన వృద్ధాప్యంలో కాకుండా మళ్ళీ తన పాత గెటప్‌లోనే కనిపించడం టైమ్ ట్రావెల్ లేదా మల్టీవర్స్ కథాంశాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా స్టీవ్ రోజర్స్ మళ్ళీ షీల్డ్ పట్టుకోవడం చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

4-పార్ట్ టీజర్ వ్యూహం మార్వెల్ ప్లాన్ ఇదేనా?

లీక్ అయిన సమాచారం ప్రకారం మార్వెల్ స్టూడియోస్ ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ ప్లాన్ వేసింది.మొత్తం నాలుగు చిన్న టీజర్‌లను విడివిడిగా విడుదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది.ఒక్కో టీజర్‌లో ఒక్కో కీలక పాత్రను పరిచయం చేస్తూ కథపై ఆసక్తిని పెంచడం వీరి ఉద్దేశం.ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ క్రిస్ ఎవాన్స్‌తో పాటు క్రిస్ హేమ్స్‌వర్త్ కూడా ఒక క్లిప్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం.

అవతార్ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల:
ఈ లీక్ అయిన క్లిప్‌లు త్వరలోనే అధికారికంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.డిసెంబర్ 19న విడుదలవుతున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాతో పాటు ఈ టీజర్‌లను థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.అధికారిక విడుదల కంటే ముందే ఈ సమాచారం బయటకు రావడంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది.2026 మే నెలలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.