DSports 31Jan 2026:మెల్‌బోర్న్: టెన్నిస్ ప్రపంచంలో కొత్త శకం ఆరంభమైంది. స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన పట్టుదల ఏంటో మరోసారి నిరూపించాడు. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మొదటి సెమీఫైనల్‌లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై అల్కరాజ్ అద్భుత విజయం సాధించి, తన కెరీర్‌లో మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

  • మెల్‌బోర్న్ పార్క్‌లోని రాడ్ లేవర్ ఎరీనా సాక్షిగా జరిగిన ఈ మ్యాచ్ టోర్నీ చరిత్రలోనే సుదీర్ఘ సెమీఫైనల్‌గా నిలిచిపోయింది. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో విజయం సాధించాడు.మూడో సెట్ మధ్యలో అల్కరాజ్ కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఒకానొక దశలో మ్యాచ్ మధ్యలోనే వైదొలుగుతాడని అందరూ భావించారు. మెడికల్ టైమ్-అవుట్ తీసుకున్న తర్వాత కూడా అల్కరాజ్ సరిగ్గా కదలలేకపోయాడు. గాయాన్ని ఆసరాగా చేసుకుని జ్వెరెవ్ వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఐదో సెట్‌లో జ్వెరెవ్ 5-4తో ముందంజలో ఉండి మ్యాచ్ గెలిచేలా కనిపించాడు. కానీ, అసాధారణ పట్టుదలతో అల్కరాజ్ తన మార్క్ షాట్లతో పుంజుకుని వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ఆదివారం (ఫిబ్రవరి 1) జరిగే గ్రాండ్ ఫైనల్‌లో అల్కరాజ్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌తో తలపడనున్నాడు. గత పారిస్ ఒలింపిక్ ఫైనల్ తర్వాత వీరిద్దరూ మరోసారి మేజర్ టైటిల్ కోసం తలపడుతుండటంతో క్రీడా ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana