DNews: Apr 21: హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్‌ను “రాహు”గా, కేసీఆర్‌ను “కేతు”గా వ్యాఖ్యానించారు. కేసీఆర్, రేవంత్ మాట్లాడే భాషపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి రూ.1 లక్ష కోట్లు లేదా రూ.9 వేల కోట్లు అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఒక్కరిపై అయినా చర్య తీసుకున్నారా అని ప్రశ్నించారు.
బండి సంజయ్ ఆరోపిస్తూ, గతంలో కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎం లాగా మారిందని, ఇప్పుడు కాంగ్రెస్‌కు మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో ఏముందో ప్రశ్నించారు. రూ.9 వేల కోట్ల అవినీతి విచారణ జరగాలని రేవంత్ చెబుతున్నారని, అయితే లక్ష కోట్ల అవినీతి గురించి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రేవంత్ రాసిన లేఖలను ఇంటింటికీ పాంప్లెట్‌ల రూపంలో పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై ప్రతి ఒక్కరూ వేరువేరుగా మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రధాని మోదీ లక్ష్యం మహిళలు అగ్రస్థానానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రా, సోనియా, ప్రియాంక గాంధీలకు పదవులు ఇస్తే అన్ని మహిళలకు పదవులు వచ్చినట్టేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష కుటుంబాల మహిళలకు పదవులు వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరుపుకుంటే సిగ్గు అని అన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ స్థానంలో కూర్చోవాలని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.
స్టాలిన్, రేవంత్ రెడ్డి మహిళా బిల్లు ఓటమికి కారణమని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పటికీ కలిసే అవకాశం లేదని, కలిసి పోటీ చేయరని బండి సంజయ్ స్పష్టం చేశారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana