DSports 06Feb 2026:(చైనా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. గురువారం జరిగిన తమ చివరి గ్రూపు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓటమి పాలైనప్పటికీ, అంతకుముందే సాధించిన విజయాలతో నాకౌట్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి.

  • యువ ఆటగాడు ఆయుష్ శెట్టి తొలి సింగిల్స్‌లో కెంటా నిషిమోటోపై ఘనవిజయం సాధించి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా గెలవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్. ప్రణయ్, డబుల్స్ జోడీ హరిహరన్ – పృథ్వి, మరియు తరుణ్ మన్నెపల్లి ఓడిపోవడంతో భారత్ విజయాన్ని చేజార్చుకుంది. స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు.
  • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు గ్రూపు-వై చివరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడి 2-3తో పరాజయం పొందింది.తొలి సింగిల్స్‌లో తన్వీ శర్మ ప్రపంచ 16వ ర్యాంకర్ బుసానన్‌పై సంచలన విజయం సాధించింది. అనంతరం ట్రీసా జాలీ – గాయత్రీ గోపీచంద్ జోడీ తమ డబుల్స్ మ్యాచ్ గెలిచి భారత్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపింది. రక్షితా రామ్ రాజ్, మాళవిక బన్సోద్ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, రెండో డబుల్స్ మ్యాచ్ కూడా థాయ్‌లాండ్ వశం కావడంతో భారత్ రన్నరప్‌గా గ్రూపు దశను ముగించింది.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana