
DSports Jan05 2026: తొలి రోజు 211/3 స్కోరుతో నిలిచిన ఇంగ్లండ్, రెండో రోజు ఆటలో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో తన స్కోరును 384 పరుగులకు చేర్చింది. రూట్ ఈ మ్యాచ్‌లో 160 పరుగులు (242 బంతుల్లో, 15 ఫోర్లు) సాధించి మైఖేల్ నెసర్ బౌలింగ్‌లో వెనుదిరిగారు.
ఈ శతకంతో జో రూట్ టెస్టు క్రికెట్లో పలు మైలురాళ్లను అందుకున్నారు 41వ టెస్టు సెంచరీ ఈ సెంచరీతో జో రూట్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (41 సెంచరీలు) రికార్డును సమం చేశారు.టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ ఇప్పుడు మూడో స్థానానికి (పాంటింగ్‌తో కలిపి) చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కల్లిస్ (45) మాత్రమే ఇప్పుడు ఆయన కంటే ముందున్నారు. టెస్టుల్లో 17వ సారి 150 కంటే ఎక్కువ పరుగులు చేసి, మహేల జయవర్ధనే రికార్డును అధిగమించారు.
