D Spiritual: Oct 31: పాలకుర్తిలో వైభవంగా ఆరుద్ర నక్షత్రోత్సవం

ప్రత్యేక పూజలు, పంచహారతులతో మార్మోగిన ఆలయం.. భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ

పాలకుర్తి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి చండికా సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రసహిత పంచసూక్త మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.

అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి పంచహారతులు, నక్షత్ర హారతి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. గర్భాలయంలో దీపోత్సవాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు దేవగిరి అనిల్ కుమార్ శర్మ, దేవగిరి రమేష్ శర్మ, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *