DET:DEC 11:
సినిమా నేపథ్యం:
తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దినేష్ లక్ష్మణన్ రచన,దర్శకత్వం వహించారు.ఈ సినిమా నవంబర్ 21,2025న థియేటర్లలో విడుదలైంది.తెలుగులో ఈ సినిమాను ముఫ్టీ పోలీస్ పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు.ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్య మరియు అనుమానాస్పద ఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడిందని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు.

ఓటీటీ విడుదల తేది:

థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే,ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు.థీయవార్ కులై నడుంగ చిత్రం డిసెంబర్ 12,2025 నుండి డిజిటల్‌గా విడుదల కానుంది.

ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు?

ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను స్ట్రీమింగ్ చేసే హక్కులను Sun NXT ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది.అంటే మీరు డిసెంబర్ 12,2025 నుండి Sun NXT ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రంలో అర్జున్ సర్జా,ఐశ్వర్య రాజేష్‌తో పాటు బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి వెంకటాచలం,ప్రవీణ్ రాజా,తంగదురై,
బేబీ అనికా వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి భరత్ ఆసీవగన్ సంగీతం అందించారు.