
D Spiritual: Mar 18: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు స్వామివారి దర్శనం చేసిన తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో చాలా మంది తీర్థం లేదా పంచామృతం తీసుకున్న తర్వాత అదే చేతితో తలపై రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని అనేక మంది నమ్మకం. అయితే ఇది నిజంగా మంచిదేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది.
పండితుల ప్రకారం, స్వామివారి దర్శనం అనంతరం తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాయకూడదు. ఒకసారి తీర్థం తీసుకున్నాక మన చేయి “ఎంగిలి” అవుతుంది. అలాంటి చేతితో తలను తాకడం అశుభంగా భావించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగవని వారు చెబుతున్నారు.
అందువల్ల, తీర్థం లేదా పంచామృతం స్వీకరించిన వెంటనే చేతులను శుభ్రంగా కడగడం మంచిది. ప్రత్యేకంగా, స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై వేసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం విషయంలో ఈ విధమైన పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
