
D News: Oct 28: రైల్వే మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో ఖాళీగా ఉన్న 1,265 రైల్వే మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే మంత్రిత్వశాఖ అక్టోబర్ 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వేలో 5 పోస్టులు
ఈ నోటిఫికేషన్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 65 పోస్టులు, దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 5 పోస్టులు ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.
నవంబర్ 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పరిశీలించాలి.
