
D Educt: Sept 22: ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి ప్రకటన
రాష్ట్రంలోని 14 దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న 185 ఎండీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.
నీట్ యూజీ అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 24వ తేదీ రాత్రి 10 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుముతో సెప్టెంబరు 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
అభ్యర్థులు బీడీఎస్ ఇంటర్న్షిప్ను ఈ ఏడాది మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8978780501, 7997710168 నంబర్లలో సంప్రదించవచ్చని విశ్వవిద్యాలయం పేర్కొంది.
