
D Educt: Nov 9: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాల కోసం 60 స్పాన్సర్ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు 8 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రవేశాల కోసం విద్యార్థులు https://ug.mjptbcwreis.net వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా బీసీ గురుకులాలు, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని సైదులు పేర్కొన్నారు.
అభ్యర్థులు తెలంగాణ ఎప్సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్లో బైపీసీ లేదా దానికి సమానమైన కోర్సు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్..
అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://mjptbcwreis.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సూచించారు.
