D News: Sept 8: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును బ్యాంకు పొడిగించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఫీజు చెల్లించేందుకు సెప్టెంబర్ 17, 2026 రాత్రి 11:59 గంటల వరకు అవకాశం కల్పించింది.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షను అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష తేదీ, ఇతర ముఖ్యమైన వివరాలను బ్యాంకు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించనుంది.

అర్హత విషయానికి వస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఏడాది పాటు ఆఫీసర్ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి.

దరఖాస్తు రుసుమును కేటగిరీల వారీగా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175గా ఫీజును నిర్ణయించారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్షతో పాటు స్థానిక భాషా పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపట్టనున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు బ్యాంకులో పనిచేసేలా సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బ్యాంకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana