
DNews: Nov24: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5,000 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఏపీ మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 217 మందికి అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తామని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగుల జీవితాల్లో ఆనందాన్ని నింపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్యం మరియు ప్రీ-స్కూల్ విద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
