D Spiritual: Jan 28: ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేవస్థానం అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ధర్మకర్తల మండలితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్, ఏసీపీలూ మరోసారి సమీక్షించి అవసరమైన మార్గనిర్దేశం చేశారు.

ఆలయ ఈవో జె. బాపి రెడ్డి గత ఏడాది అనుభవంతో ఇంజనీరింగ్ అధికారులతో పనులను వేగవంతం చేస్తున్నారు. భక్తుల బస సదుపాయాలు, సాంస్కృతిక వేదిక ఏర్పాట్లు, పార్కింగ్, సీసీ కెమెరాల అమరిక, స్వర్ణముఖి నదిలో స్నాన ఘాట్ల ఏర్పాట్లు వంటి పనులు దాదాపు పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు మరింత వేగంగా సాగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం ఈఈ శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో రథాలు, నారద పుష్కరిణిలో తెప్పలకు సంబంధించిన పనులను పరిశీలిస్తోంది. భద్రత కోసం సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి పట్టణం మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా సన్నద్ధమైంది. ఆలయం అంతా విద్యుత్ దీపాలు, రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతోంది. భక్తులు ఆలయంలో అడుగుపెట్టగానే సంప్రదాయ శోభ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా భిక్షాల గాలిగోపురానికి అమర్చిన “ఓం నమఃశివాయ” నీయాన్ లైటింగ్ తేరువీధులు, బజారువీధులను పాల వెలుగుల్లా మార్చేసింది. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏర్పాట్లన్నింటినీ ఈవో బాపి రెడ్డి సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana