
DNews: Mar18: ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ్ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి బస్ స్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. వారు డాన్ బాస్కో స్కూల్, డోలస్ నగర్, ప్రకాష్ నగర్, నులకాపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు ప్రయాణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, వారి యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి కూటమి పార్టీల ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
