
DNews: Nov22: ఏపీలో మరో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావు
- ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణ రాజు
- ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఛైర్మన్‌గా విక్రమ్
- ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మౌలానా షిబిలీ
- ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రామ్‌ప్రసాద్
- పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మధుబాబు
- స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా శంకర్‌రెడ్డి
- కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మిన్నప్ప
- స్టేట్ షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా ముక్తియార్
- భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు
- పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్‌గా వీరభద్రరావు నియమితులయ్యారు.
