
DNews: Feb26: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, బాపట్ల, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, కొన్ని జిల్లాల్లో ఇటీవల వర్షాలు కురుస్తుండగా… మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటుతున్నాయి. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
