
DNews: Feb25: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఒక కీలకమైన సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో 24 గంటల స్పీడ్ పోస్ట్ మరియు పార్శిల్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో, ప్రజలు పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా పోస్టల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ప్రారంభ దశలో, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు మరియు గుంతకల్ నగరాల్లోని ప్రధాన పోస్టాఫీసులలో ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అత్యవసర పత్రాలు, అధికారిక పత్రాలు లేదా పార్శిల్‌లను పంపాల్సిన వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
