DET:NOV 08:
నమస్కారం మలయాళ చిత్రసీమకు స్వీటీ!
ది వైల్డ్ సోర్సరర్ అనే భారీ బడ్జెట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాతో మలయాళంలోకి అడుగుపెడుతున్నారు మన అనుష్క శెట్టి. జైసూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.తాజాగా,అనుష్క పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7,ఆమె పాత్ర నీల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈ లుక్‌తో స్వీటీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు.

అసలు కథను తిరగరాసే నీల:
ఈ పోస్టర్‌ను విడుదల చేస్తూ,చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను పంచుకుంది.మీకు తెలిసిన కథ కాదు,కాలం తిరగరాసిన కథ!ఒక శాశ్వతమైన సౌందర్యం..అంటూ అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.ఈ క్యాప్షన్ బట్టి చూస్తే,కేరళ జానపద కథల్లోని ప్రసిద్ధ పాత్ర కలియంకాట్టు నీలి పాత్రను నీల రూపంలో కొత్తగా చూపించబోతున్నారని తెలుస్తోంది.అనుష్క లుక్ చాలా గంభీరంగా,అదే సమయంలో మాయాజాలం ఉన్నట్టుగా ఉండటం విశేషం.

భారీ కాస్టింగ్,అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ:
కథనార్ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.9వ శతాబ్దానికి చెందిన,మంత్రశక్తులు ఉన్నట్టుగా చెప్పబడే పూజారి కడమత్తత్తు కథనార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.కథనార్ పాత్రలో జైసూర్య నటిస్తున్నారు. అనుష్కతో పాటు, ప్రముఖ నటుడు ప్రభుదేవా కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అంతేకాకుండా,ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడుతున్నామని మేకర్స్ చెబుతున్నారు,ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

పాన్-ఇండియా రేంజ్ లో విడుదల:
శ్రీ గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మలయాళంతో పాటు,తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,ఇంగ్లీష్, బెంగాలీ,చైనీస్,ఫ్రెంచ్,కొరియన్,ఇటాలియన్,రష్యన్,ఇండోనేషియన్,జపనీస్ మరియు జర్మన్ సహా సుమారు 17 భాషల్లో విడుదల కానుంది.అనుష్క నీల లుక్‌తో,సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana