DET:OCT30:
షూటింగ్ ముగిసింది!
అనన్యా పాండే,లక్ష్యల చంద్ మేరా దిల్ షూటింగ్ పూర్తి:

ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం చంద్ మేరా దిల్ షూటింగ్ పూర్తయింది.ఈ సినిమాలో అనన్యా పాండే,లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ కొత్త జంట మొదటిసారి కలిసి నటించడం వల్ల సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.షూటింగ్ ముగియడంతో,త్వరలో ఈ సినిమా టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కానుంది.

అనన్యా-లక్ష్య ఫ్రెష్ జోడీ:
సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో అనన్యా,లక్ష్యలు బైక్‌పై రొమాంటిక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.పెళ్లి దుస్తుల్లో ఉన్నట్టు కనిపించిన ఆ జంటను చూసి అభిమానులు ముచ్చటపడ్డారు.ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చాలా బాగుంటుందని,ముఖ్యంగా ఇది కాలేజ్ రొమాన్స్ డ్రామాగా ఉంటుందని సమాచారం.ఈ సినిమాతో బాలీవుడ్‌కు లక్ష్య పరిచయమవుతున్నాడు.అతడికి ఇది పెద్ద ప్రాజెక్ట్.

విడుదల తేదీపై ఆసక్తి:
వివేక్ సోని దర్శకత్వం వహిస్తున్న ఈ చంద్ మేరా దిల్ చిత్రం 2025లో విడుదల కానుంది.ఈ సినిమా పోస్టర్లను ధర్మా ప్రొడక్షన్స్ గతంలోనే విడుదల చేసింది. ప్రేమలో కొంచెం పిచ్చిగా ఉండాలి (Pyaar Mein thoda paagal hona padta hai)” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన పోస్టర్లు యూత్‌ని ఆకట్టుకున్నాయి.ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతుందోనని సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana